సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులో ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్యానర్‌ను జిల్లా న్యాయవాది పాపిరెడ్డి ఆవిష్కరించారు.
లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా బాధితులు తమ సమస్యలను తొందరగా పరిష్కరించుకోవచ్చని పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో సుమారు వెయ్యి కేసులను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: లైంగిక దాడి కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కారాగారం