జాతీయ లోక్అదాలత్ కార్యక్రమంలో అత్యధిక కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని సంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భవాని పేర్కొన్నారు. జహీరాబాద్ కోర్టులో నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. పెండింగ్ కేసుల పురోగతిపై పోలీసులు, న్యాయవాదులతో మాట్లాడారు. ఈ నెల 13న నిర్వహిస్తున్న లోక్ అదాలత్లో బ్యాంకు కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి తగాదాలు అత్యధికంగా పరిష్కారం అయ్యేలా పోలీసులు దృష్టి సారించాలని ఆమె సూచించారు. సమీక్షా సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి నీరజ, జూనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి పాల్గొన్నారు.
ఇవీచూడండి: ముంబయిపై మరోసారి వరుణుడి పంజా