సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పురపాలక సంఘంలో లాక్డౌన్ విధించారు. మున్సిపల్ ఛైర్మన్ పాండురంగారెడ్డి విజ్ఞప్తి మేరకు నేేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ను పాటించనున్నారు. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా చాలామంది ప్రజలు, వ్యాపారస్థులు భయాందోళనలో ఉన్నారు. ఈ మేరకు వ్యాపార వర్గాలు, ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నేటి నుంచి ఈ నెల 23 వరకు రెండు వారాల పాటు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వాణిజ్య, వ్యాపార సంస్థలు తెరిచి ఉంచాలని.. 12 తర్వాత వ్యాపార సంస్థలు అన్నింటినీ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా మూసివేయాలని నిర్ణయించారు.