ETV Bharat / state

ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు - collector hanumantha rao latest news

యువత కొండా లక్ష్మణ్​ బాపూజీని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్​ హనుమంతరావు పేర్కొన్నారు. కలెక్టరేట్​లో బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

konda-laxman-bapuji-birth-anniversary-celebrations-in-sangareddy
ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు
author img

By

Published : Sep 27, 2020, 5:44 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్​ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ హనుమంతరావు బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి బాపూజీ అని కలెక్టర్​ పేర్కొన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన చరిత్రను పుస్తకాల్లో ప్రచురిస్తే.. విద్యార్థులు ఆయన గురించి మరింత తెలుసుకునే వీలుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంఘం ప్రతినిధులు కలెక్టర్​ను కోరగా.. అధికారుల దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. కరపత్రాల ద్వారా బాపూజీ గురించి ప్రచారం చేయాలని సంఘ నాయకులకు సూచించారు.
ఇదీచూడండి: ఓయూలో కొండా లక్ష్మణ్​ బాపూజీ జయంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.