జగ్గారెడ్డితో ఇష్టాగోష్ఠి ప్రజలకు తాగు, సాగు నీరందించాలనే తన విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని నమ్ముతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హరీశ్‌రావు అత్యుత్సహంతోనే సింగూరు జలాలను తరలించారని ఆరోపించారు. బడ్జెట్ కేటాయిపులు రాష్ట్ర ప్రజలపై ఏవిధంగాప్రభావం చూపుతాయో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతారని తెలిపారు.
పార్లమెంటులో హస్తానిదే హవా
పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఉత్తమ్ ఒక్కడే బాధ్యుడు కాదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బయటకు ఎవ్వరూ వెళ్లేదిలేదని స్పష్టం చేశారు.