సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం ప్రజా పరిషత్తు కార్యాలయంలో అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. పాజిటివ్ వచ్చిన అధికారి కార్యాలయ పనుల నిమిత్తం నిత్యం హైదరాబాద్ నుంచి రాకపోకలు చేస్తుంటారు. పాజిటివ్ వచ్చిన అధికారి రెండు రోజుల క్రితం మండల కార్యాలయంలో విధులకు హాజరయ్యారు. ఆయనకు కొవిడ్-19 పాజిటివ్ సోకిందని తెలియగానే.. కార్యాలయ సిబ్బంది అందరూ పరీక్షలు చేయించుకోవాలని, 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని జిల్లా కలెక్టర్ సిబ్బందికి ఆదేశించారు. జులై 30న ఎంపీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సదరు అధికారి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధికారులు సైతం పాల్గొన్నారు. అధికారికి కరోనా విషయం తెలియగానే వారంతా ఆందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి:ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల