సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం పరివార్ దాబా వద్ద ఈనెల 6న జరిగిన ఇద్దరు గైడ్ల హత్య, మరుసటి రోజు సంగారెడ్డిలో జరిగిన మరో యువకుడి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. జిల్లాలో ఈ మూడు హత్యలూ ఒకరోజు వ్యవధిలోనే జరగడం వల్ల.. ఈ మూడింటినీ ఒక్కరే చేసి ఉంటారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
విచారణలో భాగంగా సీసీ కెమెరాల ఆధారంగా కనిపెట్టిన ఆర్15 v2 మోడల్ బైక్ కోసం గాలిస్తున్నారు. హత్య చేసిన తర్వాత నిందితుడు ఇదే బైక్పై అనుమానాస్పద ప్రాంతాల్లో తిరిగినట్లుగా సీసీ కెమెరాల్లో నమోదైంది.
మరోవైపు ఈ హత్యలకు పాల్పడిన వాడు సైకో కిల్లర్ అయి ఉంటాడని అనుమానం వ్యక్తమవుతోంది.
ఇవీ చూడండి: వరంగల్ అర్బన్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి దుర్మరణం