సంగారెడ్డి జిల్లాలోని గీతం విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రం అప్లికేషన్లు అనే అంశంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. గణితానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది భారతీయ శాస్త్రవేత్తలేనని మంత్రి స్పష్టం చేశారు. పలువురు నిపుణులతో ప్రసంగాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 250 మంది పరిశోధకులు తమ పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు.
ఇదీ చూడండి : 'మొక్కలను సంరక్షిస్తే ప్రత్యేక బహుమతులు'