సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకున్నారు.
జిల్లాలో మొత్తం 49 పరీక్ష కేంద్రాలలో 16076 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యార్థులు నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.