సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఠాణాలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన కేసు నమోదైంది. పటాన్చెరుకు చెందిన ప్రశాంతి, గాయత్రి అనే విద్యార్థినిలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మంగళవారం కళాశాలకు వెళ్లివస్తామంటూ వెళ్లినవారు తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లభించలేదు. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థినుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ అమ్మాయిలు ఎందుకు గడప దాటుతున్నారు?