ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు వెళ్ళి ఓ యువతి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొల్లూరుకు చెందిన ఎట్టయ్య కుమార్తె శ్వేత.. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తోంది. ఈనెల 17న పరీక్ష రాసేందుకు ఉదయం ఏడు గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది. పరీక్ష అనంతరం ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. అప్పటి నుంచి శ్వేత ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని తల్లిదండ్రులు తెలిపారు. యువతి కనిపించకపోవడం వల్ల పటాన్చెరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్-19 ఎఫెక్ట్