ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. జహీరాబాద్‌లోని గడిమొహల్లకు చెందిన సయ్యద్ అబేద్ అలీ పట్టణంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం పరీక్ష రాస్తూ కాపీయింగ్‌కు పాల్పడి పట్టుబడినట్లు సమాచారం. మనస్థాపానికి గురైన విద్యార్థి ఆబేద్ ఇంటి పెంట్ హౌస్ గదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా కుటుంబీకులు గుర్తించి హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాధితుడు అప్పటికే మృతి చెందినట్లు స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : స్నేహితుల వద్దకు వెళ్లొస్తానని చెప్పి.. అనంతలోకాలకు