సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన ఈశ్వరయ్య కుమారుడు అనిల్ (16) ఇంటర్ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన అరుణ్, శంకర్ రెడ్డి, జానకిరామిరెడ్డిలతో కలిసి అనిల్ గ్రామ శివారులోని గిద్ద చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులో తక్కువ లోతు ఉన్న ప్రాంతంలో దిగి ఆడుకున్నారు.
ప్రమాదవశాత్తు అనిల్ లోతుగా ఉన్న వైపు వెళ్లడం వల్ల నీటిలో మునిగిపోయాడు. మిగతా ముగ్గురు స్నేహితులకు కూడా ఈత రాకపోవడం వల్ల అనిల్ మునిగిపోతుంటే కాపాడలేకపోయారు. స్థానికులకు తెలిసే సరికి ఆలస్యం కావడం వల్ల అప్పటికే నీళ్లు మింగిన అనిల్ ప్రాణాలు విడిచాడు. తండ్రి ఈశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు