సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఇందిరా గాంధీ వర్ధంతి నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కోసం త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి అన్నారు.
తమ పార్టీ ఎల్లప్పుడు పేదవాళ్లకు అండగా నిలుస్తుందని తెలిపారు. దేశానికి ఇందిరమ్మ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.
- ఇదీ చూడండి : ఇందిరా గాంధీకి కాంగ్రెస్ ప్రముఖుల నివాళులు