ETV Bharat / state

ఊపిరి పోసే జీవన దీపం

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వెంటిలేటర్ల కొరత అన్ని దేశాలను కలవరపెడుతోంది. మనదేశంలో తగినన్ని వెంటిలేటర్లను అందుబాటులోకి తెచ్చేలా ఐఐటీ హైదరాబాద్​ ముందుకొచ్చింది. బ్యాటరీతో పనిచేసే నమూనాను ఐఐటీ-హెచ్​ 12 రోజుల్లోనే సిద్ధం చేసింది.

IIT HYDERABAD MANUFACTURED VENTILATOR
ఊపిరి పోసే జీవన దీపం
author img

By

Published : Apr 4, 2020, 7:51 AM IST

సంపన్న దేశాల్లోనూ వెంటిలేటర్లు లేక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్న దయనీయ స్ధితి. ఇలాంటి తరుణంలో మనదేశంలో వైరస్‌ విజృంభిస్తే తగినన్ని వెంటిలేటర్లను అందుబాటులోకి తెచ్చేలా ఐఐటీ హైదరాబాద్‌ ముందుకొచ్చింది. సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లడంతోపాటు బ్యాటరీతో పనిచేసే నమూనా(ప్రొటోటైప్‌)ను ఐఐటీ-హెచ్‌ అంకుర సంస్థ ఏరోబయోసిస్‌ 12 రోజుల్లోనే సిద్ధం చేసింది. దీనికి ‘జీవన్‌లైట్‌’గా నామకరణం చేసినట్లు ఐఐటీ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశాయి.

ఇవీ ప్రత్యేకతలు...

  • ఈ వెంటిలేటర్‌ లిథియం అయాన్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5 గంటలపాటు వాడుకోవచ్చు.
  • ఇందులో ఐవోటీ(ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) సాంకేతికతను వాడారు. దీనివల్ల బాధితుల శ్వాసకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వైద్యులు తమ చరవాణిలోని యాప్‌ ద్వారా పర్యవేక్షించవచ్చు.
  • ప్రతిసారీ బాధితుల దగ్గరకు వెళ్లి పరీక్షించాల్సిన అవసరం తప్పుతుంది. అంటే ఇది వైద్యులకూ రక్షణగా నిలుస్తుందని ఆవిష్కకర్తలు చెబుతున్నారు.
  • చిన్నగా ఉన్న ఈ వెంటిలేటర్‌తో అన్ని వయసుల వారికీ సేవలు అందించొచ్చు.
  • వెంటిలేటర్‌ చుట్టుపక్కల ఉండే గాలిని శుభ్రపరిచి రోగికి అందిస్తుంది.
  • రూ.1 లక్షకే దీనిని అందుబాటులోకి తేనున్నారు. భవిష్యత్తులో ఖర్చును తగ్గించడానికి అవకాశముంది.

రోజుకు 50 నుంచి 70 వరకు ఉత్పత్తి

తయారీదారులు ముందుకొస్తే ఈనెలాఖరుకు మార్కెట్లోకి తెస్తామని, ఆ దిశగా కొన్ని సంస్థలతోనూ చర్చించినట్లు ఏరోబయోసిస్‌ సహ వ్యవస్థాపకులు రాజేష్‌ తంగవేల్‌, సిరిల్‌ ఆంటోనీ తెలిపారు. తయారీదారులు ముందుకొస్తే రోజుకు 50-70 వరకు ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఇది గుండె జబ్బులు, టైప్‌-2 మధుమేహంతో బాధపడుతున్న వారికీ ఉపయోగపడుతుందని సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కో-హెడ్‌ ఆచార్య రేణూజాన్‌ చెబుతున్నారు. బాధితులతోపాటు వైద్యులకూ రక్షణనిచ్చే ఫీచర్లతో దీన్ని తయారు చేయడం గొప్ప విషయమని ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌ మూర్తి అన్నారు. జీవన్‌లైట్‌ను డీఆర్‌డీఓ, ఐసీఎంఆర్‌ సంస్థల ప్రతినిధులు త్వరలో పరిశీలించనున్నారు.

ఇవీ చూడండి: ర్యాపిడ్ టెస్టింగ్ కిట్​తో ఇంటివద్దే కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.