రోడ్లపైకి అనవసరంగా ఎవరూ బయటకు రాకుండా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేయాలని హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు శివారు బాహ్యవలయ రహదారి సమీపంలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులో ఆయన వాహన తనిఖీలు చేశారు. అనంతరం లాక్డౌన్ పరిస్థితులపై ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సర్వీసులు తప్ప మిగిలినవారిని ఎవరినీ వదిలి పెట్టవద్దని తెలిపారు.
కొవిడ్ లింక్‌ను విచ్ఛిన్నం చేస్తే వైరస్ వ్యాపించేందుకు ఆస్కారం ఉండదని ఆయన తెలిపారు. అనవసరంగా రహదారుల పైకి రావద్దని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పాస్‌లను నిబంధనలకు విరుద్ధంగా వాడవద్దని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పోలీసుల లాఠీఛార్జ్.. ఫలితంగా మూడు గంటలు కరెంట్ కట్..!