కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఇక్రిశాట్ తమ సిబ్బందికి ఇంటి నుంచే విధులు నిర్వహించే అవకాశం కల్పించింది.
హైదరాబాద్ శివారులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థకు తరచూ దేశవిదేశాల నుంచి శాస్త్రవేత్తలు వస్తుంటారు. ఉద్యోగులతో కలిపి ఇలా నిత్యం ఇక్కడికి వచ్చేవారు దాదాపు 1200 మంది ఉంటారు.
ఇందులో ఉద్యోగుల సంఖ్య 800లకుపైనే ఉంటుంది. కాగా కరోనా ప్రభావం వల్ల వీరందరికీ ఇంటి వద్ద నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించారు.
ఇదీ చదవండి: 8 వేలు దాటిన కరోనా మరణాలు.. 2లక్షలకు పైగా కేసులు