ETV Bharat / state

క్వారీలే జలసమాధులై..

వేసవిలో సేద తీరేందుకు ఈతకు వెళ్తున్న కొందరికి అవి అద్భుత క్షణాలుగా మిగులుతుండగా, మరికొందరికి అవే ఆఖరి ఘట్టాలుగా నిలిచిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా రుద్రారం సమీపంలో క్వారీలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యుఒడికి చేరిన ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

author img

By

Published : Jun 6, 2019, 9:44 PM IST

క్వారీలే జలసమాధులై..
క్వారీలే జలసమాధులై..

అధికారుల అలసత్వం.. ప్రభుత్వాల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలికొంటున్నాయి. క్వారీల్లో తవ్వకాలకు అనుమతిస్తున్న అధికారులు.. అనంతరం వాటి ఊసేత్తడం లేదు. తవ్వకాలు పూర్తైన తర్వాత నిర్దేశ ప్రమాణాలతో రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అధికారులు వాటి జోలికెళ్లడం లేదు. ఫలితంగా గుంతల్లో స్నానాలు చేసేందుకు వెళ్తున్న చిన్నారులు జలసమాధి అవుతున్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

నలుగురు జలసమాధి

వేసవి సెలవుల్లో సేదతీరేందుకు బాలాజీ నగర్​కు చెందిన ఆనంద్​, నందిని, లోకేశ్​, గోవర్దన్​లు పటాన్​చెరు మండలం రుద్రారంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. బుధవారం అందరితో భోజనం చేసిన అనంతరం ఈత కొట్టేందుకు సమీపంలోని క్వారీకి వెళ్లారు. దివ్య, అమూల్యాలు ఒడ్డునే ఉండిపోగా.. ఆనంద్​, లోకేశ్​, నందిని, గోవర్దన్​లు ఈతకు దిగారు. కాసేపు నీటిలో ఆడుకున్న వారంతా అక్కడే జలసమాధి అవుతామని ఊహించలేకపోయారు. సరదాగా ఈత కొడుతున్న నందిని ఒక్కసారిగా మునిగిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో మిగతా ముగ్గురు లోపలికి వెళ్లారు. ఈత రాకపోవడం వల్ల ఎవరూ పైకి రాలేకపోయారు. ఒడ్డుమీదనున్న దివ్య, ఆమూల్య దీన్ని గుర్తించి కుటుంబ సభ్యులుకు, స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఎంత ప్రయత్నించినా వారి ఆచూకీ కనుగొనలేకపోయారు.

ఉత్సాహం కాస్తా విషాదం

సమాచారం అందుకున్న పోలీసులు గత ఈత గాళ్లను రంగంలోకి దించారు. ఎట్టకేలకు నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. తాము ఎంత చెప్పిన వినలేదని నందిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. సరదాగా బంధువుల ఇంటికి వెళ్లిన వారు ఉత్సాహంగా తిరిగొస్తారనుకుంటే ఇలాంటి విషాధ వార్త వినాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతం అయింది.

వేసవి సెలవుల్లో తమ పిల్లలను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తోడుగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

గ్రామానికి సమీపంలో ఉన్న క్వారీ మృత్యు కుహరంలా తయారైందని... దానిని మూసివేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: "వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయాడు"

Intro:hyd_tg_18_06_quary_death_pkg_R62_C10
Lsnraju:9394450162
యాంకర్:

Body:హైదరాబాదు బ్యూరో నుంచి నుంచి స్క్రిప్ట్ వస్తుంది గమనించగలరు

Conclusion:బైట్ 1దినకర్ మృతి చెందిన పిల్లల తండ్రి
బైట్ 2రాజు మృతి చెందిన బాలుడు తండ్రి
బైట్ 3మృతి చెందిన పిల్లల తల్లి
బైట్ 4మృతి చెందిన బాలుడు తల్లి
బైట్ 5నరేష్ సీఐ పటాన్చెరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.