లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. జహీరాబాద్‌లో తెరాస ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా హోం మంత్రి మహమూద్ అలీ రోడ్‌షోలో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా ఎంపీగా సేవలందించిన పాటిల్‌ను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్‌షో అనంతరం సభ నిర్వహించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎమ్మెల్సీ మహమూద్ ఫరీదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రసాభాసగా కురుమ సంఘం నాయకుడి సన్మాన సభ