ప్రాణాలకు తెగించి పోరాడి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో హోం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
శాంతి భద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కోన్నారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌తో చేతులు శుభ్ర పరుచుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: బంగారు తెలంగాణ దిశగా.. పచ్చని మాగాణియే లక్ష్యం