Historical Buildings Collapse in Andole : సంగారెడ్డి(sangareddy) జిల్లాలోని ఆందోల్‌లో ప్రవేశించగానే రాజుల పాలన నాటి కట్టడాలు కనిపిస్తాయి. కానీ అవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. మున్సిపాలిటీగా ఉన్న ఆందోల్‌లో ఆనాడు నిర్మించిన ప్రహరీ గోడ అదృశ్యమైంది. అక్కడక్కడ మాత్రమే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆందోల్-జోగిపేట్ పురపాలక పరిధిలో ఘన చరిత్ర కలిగిన బురుజులు మరమ్మతులకు నోచుకోక కూలిపోయే దశకు చేరాయి.
యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తున్న సంగారెడ్డి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ
Monuments in Telangana : అప్పట్లో ఈ ప్రాంతంలో 3 గౌనిలు, 36 బురుజులు ఆరు చిన్న దొడ్డీలు, ఒక సొరంగ మార్గాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు మాత్రం గత వైభవం తాలుకు ఆనవాలు పూర్తిగా మాయంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల ఉన్న వాటిని పునరుద్ధరించకపోవడం వల్ల అవి ఎప్పుడు కూలుతాయోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
"ఆందోల్ చరిత్ర ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుడు ఈ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా పాలించాడు. దేశాయిని తన సామంతరాజుగా నియమించుకుని ఈ కోటలను వారి కాలంలో నిర్మించారు. అప్పటి రాజుల పాలనకు ఇవి చారిత్రక ఆనవాలుగా నిలుస్తున్నాయి". - ప్రదీప్గౌడ్, మాజీ సర్పంచ్
ఖాళీ సమయం వస్తే చరిత్ర గుర్తులను చూడటానికి కుటుంబంతో సహా వేరే ప్రాంతాలకు వెళ్లి చూసి వస్తుటాం. కానీ మన దగ్గర ఉన్న గుర్తులను మాత్రం గుర్తించం, వాటిని కాపాడాలన్న సామాజిక స్పహా మనకు కలగదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు శిథిలావస్తకు చేరుకున్న గౌనీలను గుర్తించి వాటిని పరిరక్షించాలని కోరుతున్నారు.
"ఆందోల్‌లోని చరిత్ర కట్టడాలు కనుమరుగవుతున్నాయి. ఖాళీ సమయం వస్తే చరిత్ర గుర్తులను చూడటానికి కుటుంబంతో సహా వేరే ప్రాంతాలకు వెళ్లి చూసి వస్తుంటాం. కానీ మన దగ్గర ఉన్న వాటిని మాత్రం గుర్తించం. అధికారులు శిథిలావస్థకు చేరుకున్న గౌనీలను గుర్తించి వాటిని పరిరక్షించాలి". - విజయ్, గ్రామస్థుడు, ఆందోల్
మెుత్తం పురపాలిక సంఘం చుట్టూ మూడు ప్రాంతాల నుంచి లోపలికి రావడానికి మూడు గౌనీలు ఉన్నాయి. ఆ కాలంలో రాత్రి 7 గంటలు దాడితే గ్రామంలోనికి వీటి నుంచి ప్రవేశం ఉండేదికాదు. అత్యవసమైతే పక్కనే ఉన్న చిన్న గేటు ద్వారా లోనికి అనుమతించే వారు. అంత పటిష్ట బందోబస్తు ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఇవి ప్రభుత్వ భూములు కావడంతో ఆక్రమణకు గురవుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పంధించి చరిత్ర గుర్తులను కాపాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఆక్రమణకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. చరిత్ర గుర్తులను పదిలం చేస్తే రాబోయో తరాలకు దిక్చూచిగా ఆందోల్ నిలుస్తోంది.