సంగారెడ్డి జిల్లా కంగ్టి, సిర్గాపూర్, నాగల్గిద్ద మండలాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ఎగువ ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.
నల్లవాగు ప్రాజెక్ట్ ఉపవాగులు, ఊరవాగు ఉద్ధృతంగా ప్రవహించాయి. ఈ వాగు నారాయణఖేడ్- కంగ్టి మార్గంలోని వంతెనపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. వాగు నీటి ప్రవాహం పంట పొలాల్లోకి చేరింది.