ఎన్నికల్లో గెలిచినా ఓడినా సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలని భాజపా నాయకులకు, కార్యకర్తలకు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి సూచించారు. పటాన్చెరు మండలం ఘనపూర్లో 25 మంది యువకులకు బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ చేయించిన ఆరోగ్య బీమా కార్డులను నరేందర్ రెడ్డి పంపిణీ చేశారు.
ఒక్కొక్కరికి రూ. లక్ష విలువ చేసే ఆరోగ్య బీమా అందించడం మంచి విషయమని.. ఇదే ఆదర్శంతో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని భాజపా రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. అలాంటి వారిని పార్టీ ప్రోత్సహిస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: 'సమాజానికి దశ దిశ నిర్ణయించేది పత్రికా రంగమే'