ETV Bharat / state

గ్రామాల నుంచి హైదరాబాద్​కు కూరగాయలు: మంత్రి హరీశ్​ - కూరగాయల ధరలపై స్పందించిన హరీశ్​రావు

గ్రామాల నుంచి హైదరాబాద్​కు కూరగాయల రవాణాకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్​రావు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్​ను హరీశ్​ సందర్శించారు.

harish rao
గ్రామాల నుంచి హైదరాబాద్​కు కూరగాయలు: హరీశ్​రావు
author img

By

Published : Mar 26, 2020, 4:19 PM IST

లాక్​డౌన్​ కారణంగా సరుకుల రవాణా నిలిచిపోవడం వల్ల పట్టణాలు, నగరాల్లో కూరగాయల ధరలు పెరిగాయని ఆర్థిక మంత్రి హరీశ్​రావు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్​ను హరీశ్​రావు సందర్శించారు. కూరగాయలు అమ్మడుపోవడం లేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి హైదరాబాద్​లో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.

అందుబాటు ధరలకు కూరగాయలు దొరక్క.. నగరవాసులు అవస్థలు పడుతుండగా.. గ్రామాల్లో అమ్ముడవక వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు. ఎరువులు, పురుగుల మందు దొరకడం లేదని కొందరు రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. వారి సమస్యలను పరిస్కరిస్తానని హామీ ఇచ్చారు.

కరోనా కట్టడికి ఇళ్లలోనే ఉంటూ.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ పరిస్థితిని ప్రతినిత్యం సమీక్షిస్తున్నారని తెలిపారు.

గ్రామాల నుంచి హైదరాబాద్​కు కూరగాయలు: హరీశ్​రావు

ఇవీచూడండి: తెలంగాణలో 44కు కరోనా కేసులు.. ఇద్దరు వైద్యులకూ పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.