ETV Bharat / state

నిధులకు కొదువలేదు... పనుల జాడలేదు

నిధులకు కొదువ లేకున్నా.. అక్కడ పనుల జాడ కనిపించట్లేదు. గుత్తేదారుల జాప్యంతో శ్మశాన వాటికల పనులు నత్తనడకన సాగుతున్నాయి. అన్ని సౌకర్యాలతో వాటికలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ఆదేశాలున్నా... స్థానికు అధికారుల్లో చలనం ఉండటం లేదు. ఫలితంగా అంత్యక్రియల నిర్వహణకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

graveyard-issues-in-sangareddy-district
నిధులకు కొదువలేదు... పనుల జాడలేదు
author img

By

Published : Nov 3, 2020, 12:36 PM IST

గ్రామాల్లో వైకుంఠధామం పేరుతో శ్మశాన వాటికల పనులు శరవేగంగా చేస్తుంటే పట్టణాల్లో నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని పురపాలికల్లో తగినన్ని నిధులు ఉన్నా... పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. మరికొన్ని చోట్ల ఇప్పటికీ నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కొత్తగా ఏర్పాటైన పురపాలికలకు ఇటీవల నిధులు కేటాయించారు. పనులు చేయించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యాచరణ రూపొందించాల్సి ఉంది. అన్ని సౌకర్యాలతో వాటికలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ఆదేశాలున్నా స్థానిక అధికారుల్లో చలనం ఉండటం లేదు. ఫలితంగా అంత్యక్రియల నిర్వహణకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

శ్మశాన వాటికలో పొదలు

సంగారెడ్డిలో..

● సంగారెడ్డి పట్టణ శివారులోని శ్మశాన వాటికను ఆదర్శ వైకుంఠధామంగా తీర్చిదిద్దేందుకు రెండు సంవత్సరాల క్రితం రూ.2 కోట్లు మంజూరు చేశారు. దహన సంస్కారాలు చేసేందుకు ఏర్పాట్లతో పాటు, స్నానాల గదులు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. పనులు దక్కించుకున్న గుత్తేదారు కేవలం కొంత వరకు ప్రహరీ నిర్మించి వదిలేశారు. ఇటీవల కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు ఈ విషయం ప్రస్తావిస్తే, సంబంధిత గుత్తేదారుని నల్ల జాబితాలో ఉంచుతామని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

జహీరాబాద్‌లో..

● పట్టణ శివారులో శ్మశాన వాటికలకు విశాలమైన స్థలం ఉంది. దహన సంస్కారాలకు ఏర్పాట్లు, శివుని విగ్రహం, స్నానాల గదుల నిర్మాణానికి రూ.1.02 కోట్లు కేటాయించారు. 2018-19 సంవత్సరంలో ఈ నిధులు వచ్చినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించినా ఫలితం లేకపోయింది. పట్టణంలోని 15 శ్మశాన వాటికలు ఉన్నా అన్నింటిలో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి.

సదాశివపేటలో..

● పట్టణంలోని శ్మశాన వాటికల అభివృద్ధికి రెండు సంవత్సరాల క్రితం రూ.2 కోట్ల నిధులు కేటాయించారు. ఇక్కడ పనులు ఇంకా సాగుతున్నాయి. పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉంది.

పట్టణాల్లో ఇలా..

● ఐడీఏ బొల్లారం పురపాలిక పరిధిలో అయిదు శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇటీవల రూ.50 లక్షలు మంజూరు అయ్యాయి. దహన సంస్కారాలకు ఏర్పాట్లతో పాటు తాగు నీరు, స్నానాల గదులు నిర్మిస్తున్నారు.

● అమీన్‌పూర్‌ పురపాలికకు ఇటీవల రూ.50 లక్షల నిధులు కేటాయించారు. ఇక్కడ పనులు పూర్తి చేసే ప్రజలకు ఇబ్బందులు తీరుతాయి.

● నారాయణఖేడ్‌ పురపాలిక పరిధిలోని శ్మశాన వాటికల్లో కనీస వసతులు లేవు. ముళ్ల చెట్లు పెరిగి అధ్వానంగా ఉన్నాయి. వీటి అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.

● అందోలు- జోగిపేట పురపాలికకు రూ.10 లక్షల నిధులు కేటాయించారు. పనులు జరుగుతున్నాయి.

● తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలో శ్మశాన వాటికలకు రూ.40 లక్షల నిధులు కేటాయించారు. ఈ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని పట్టణవాసులు కోరుతున్నారు.

నివేదిక తెప్పించి పరిశీలిస్తాం

పురపాలికల్లో శ్మశాన వాటికలకు నిధులు, పనులకు సంబంధించి నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తామని జిల్లా అదనపు పాలనాధికారి రాజర్షిషా పేర్కొన్నారు. ఎక్కడైనా నిధులు ఉండి పనులు జరగకుంటే వెంటనే చేయించేలా ఆదేశాలిస్తామని వెల్లడించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత గుత్తేదారుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.