ETV Bharat / state

‘ఆసరా’ కోసం చేతులు చాస్తున్న అవ్వ - సిద్ధిపేటలో ‘ఆసరా’ కోసం అవ్వ వేదన

లాక్ డౌన్ కారణంగా.. ఉపాధి కోల్పోయి పస్తులుంటున్న ఓ వృద్ధురాలికి దాతలు ఆర్ధికంగా అండగా నిలిచారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం చిట్యాల గ్రామానికి చెందిన నర్సవ్వకు నిత్యావసరాలతో పాటు, కొంత నగదును అందజేశారు. తనకు ఆసరా పింఛన్ ఇప్పించాలని అధికారులను వేడు కుంటోంది.

Grandmother stretching her arms for Pention In Siddipeta
‘ఆసరా’ కోసం చేతులు చాస్తున్న అవ్వ
author img

By

Published : May 18, 2020, 2:08 PM IST

ఆరుపదుల వయసు దాటిన ఈ అవ్వ పేరు బొర్ర నర్సవ్వ. చేర్యాల మండలం చిట్యాల గ్రామం. ఒంటరిగా ఉంటోంది. ఉన్న ఒక్క కొడుకు ఉపాధి కోసం పట్నం వెళ్లి కూలీ చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ‘లాక్‌డౌన్‌’తో ఇంటికి రాలేని పరిస్థితి. గ్రామంలో నిలువ నీడలేక ఇన్నాళ్లు గుడిసెలో నివసించేది.

రెండు నెలలుగా పస్తులు..

ఇటీవల బలమైన ఈదురుగాలులకు గుడిసె కొట్టుకుపోయింది. గుడిసెలో ఉన్న బియ్యంతో పాటు సామగ్రి తడిసి పోయింది. తర్వాత ఆమె తడకలు, సంచులతో మళ్లీ గుడిసె వేసుకుంది. రెక్కాడితే గాని డొక్కనిండని ఆమెకు రేషన్‌కార్డు లేదు. పింఛను రాదు. నిత్యం కూలీ పనులకు వెళ్తేనే కడుపు నిండేది. దాదాపు రెండు నెలలుగా పనులు లేక పస్తులుంటున్న దుస్థితి నెలకొంది.

బియ్యం, నగదు అందజేత..

వృద్ధురాలి దీన పరిస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న చేర్యాలకు చెందిన పశువైద్యుడు, చేర్యాల రెవెన్యూ డివిజన్‌ సాధన ఐకాస కోకన్వీనరు డాక్టరు. కాటం శ్రీధర్‌ విషయాన్ని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆమెకు సాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువజన సంఘం ఆధ్వర్యంలో రూ.వెయ్యి చెక్కు, డాక్టరు కాటం శ్రీధర్‌ రూ.వెయ్యి నగదు అందజేయగా, ప్రొఫెసర్‌ జయశంకర్‌ సేవా సమితి అధ్యక్షుడు కొత్తపల్లి సతీశ్‌ 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.