సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంఠపురం ఆలయంలో శ్రీ మహాలక్ష్మీ గోదాసమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామి వారి కల్యాణంలో శ్రీ బేవనాథ జీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ వేడుకలో దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కల్యాణాన్ని తిలకించారు. స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, కరోనా నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోవాలని ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: వైభవంగా గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం