సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. పటాన్చెరుకు వస్తున్న గోదావరి నీళ్లను సంగారెడ్డికి తరలించాలని కోరారు. సంగారెడ్డి ప్రజలు గత రెండు నెలలుగా నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అధికారులు, ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదన్నారు. తాగునీటి సమస్యను ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం, అధికారులు నీటి సమస్యపై స్పందించాలని.. లేనిపక్షంలో ఆగస్టు 10న అంబేడ్కర్ మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ, ధర్నా చేపడతామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: కుమారస్వామి రాజీనామా తప్పదు: యడ్డీ