ETV Bharat / state

ఆ ఊరిలో గాంధీజీకి గుడి... అన్ని పండుగలు అక్కడే...! - GANDHI 150TH BIRTH ANNIVERSARY

మహాత్ముడు తెచ్చిన స్వతంత్రం... సూచించిన మార్గం... బాపూజీ ఇచ్చిన స్ఫూర్తికి ఆ గ్రామస్థులు జాతిపితకు ఏకంగా గుడి కట్టారు. అహింస మార్గంలో భారతవనికి స్వేచ్ఛావాయువులు అందించిన ఆ మహనీయునికి పూజలు చేస్తూ... ఆయన సేవలను స్మరించుకుంటారు. ప్రతి పర్వదినాన్ని మహాత్ముని సన్నిధిలో జరుపుకుంటూ... తమదైన శైలిలో నివాళులర్పిస్తున్నారు.

GANDHI TEMPLE AT SANGAREDDY DISTRICT DHANASIRI VILLAGE
author img

By

Published : Oct 2, 2019, 5:36 AM IST

Updated : Oct 2, 2019, 7:56 AM IST

దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్మున్ని స్మరించుకునేందుకు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరిలో ఐదు దశాబ్దాల క్రితమే గాంధీజీకి గుడి కట్టారు. ఆ గ్రామంలో కులమతాలకు అతీతంగా జాతిపితను పూజిస్తారు. కొన్నాళ్లకు ఈ దేవాలయం శిథిలావస్థకు చేరటం వల్ల 1995లో అప్పటి ఎమ్మెల్యే నరసింహారెడ్డి పునర్నిర్మించారు. మహాత్ముడి స్ఫూర్తిని అందిపుచ్చుకున్న ధనసిరి నుంచి వంద మందికి పైగా... దేశ సైన్యంలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్న వారితో పాటు విశ్రాంత సైనికులు దేవాలయంలో మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పిస్తారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో... ఛత్రపతి శివాజీ, మహాత్మ బసవేశ్వర్, వాల్మీకి మహర్షి, భూమ్ గొండేశ్వర్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలు దర్శనమిస్తాయి. ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలతో పాటు గాంధీ జయంతి రోజున దేవాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి మహాత్ముడిని స్మరించుకుంటారు.

ధనసిరి గ్రామంలో పని చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు గౌరవంగా భావిస్తారు. గ్రామస్థులతో మమేకమై ఏటా నిర్వహించే వేడుకల్లో పాల్గొని జాతిపితకు తమదైన శైలిలో నివాళులర్పిస్తారు.

మహాత్ముడి ఆలయ ప్రాకారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి సమీపంలో ఉన్నందున సందర్శనకు వచ్చిన అధికారులు, సిబ్బంది ఆలయాన్ని దర్శించుకుంటారు. గ్రామస్థుల దేశభక్తిని కొనియాడుతూ... ఆలయ నిర్మాణ విశేషాలు అడిగి తెలుసుకుంటుంటారు.

ఆ ఊరిలో గాంధీజీకి గుడి... అన్ని పండుగలు అక్కడే...!

ఇవీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

Last Updated : Oct 2, 2019, 7:56 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.