సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డిలు మున్సిపల్, పోలీసు సిబ్బందికి బత్తాయి పండ్లు అందించారు. సగం జీతాలే వస్తున్నా ఇతరులకు సాయమందించేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడం సంతోషమని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.
ప్రస్తుత కాలంలో 24 గంటలు పనిచేస్తున్న మున్సిపల్, పోలీసు, వైద్య సిబ్బందిని ఆదుకోవడం అందరి కర్తవ్యమని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మున్సిపల్, పోలీసు, వైద్య సిబ్బందికి ఇంతకుముందు నిత్యావసరాలను అందించామని పీఆర్టీయూ నేతలు తెలిపారు.
ఇదీ చూడండి: ఇర్ఫాన్‌ఖాన్‌కు సైకత శిల్పంతో ఘననివాళి