ETV Bharat / state

లైంగిక వాంఛ తీర్చనందుకు మిత్రునిపై దాడి...! - మద్యం మత్తులో ఓ యువకుడు తన మిత్రునిపై దాడి

వాళ్లిద్దరూ మంచి మిత్రులు. ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మత్తులో ఉన్న ఓ యువకుడికి లైంగిక వాంఛ కలిగింది. తన కోరిక తీర్చమని తోటి మిత్రున్ని అడిగాడు. దానికి సరేమిరా అన్న స్నేహితునిపై కోపంతో ఊగిపోయి రాయితో దాడి చేసి తీవ్రస్థాయిలో గాయపరిచాడు ఓ యువకుడు.

Friend assaulting a friend for not having sex ...!
author img

By

Published : Oct 16, 2019, 11:53 PM IST

తన లైంగిక కోరిక తీర్చనందుకు మద్యం మత్తులో ఓ యువకుడు తన మిత్రునిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ విచిత్ర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కంగ్టి మండలం బాన్సువాడకు చెందిన సాయిలు, రమేష్ అనే ఇద్దరు మిత్రులు కలిసి ఊరి శివారులో మద్యం సేవించారు. అనంతరం రమేష్​ను పత్తి చేనులోకి తీసుకెళ్లిన సాయిలు తన లైంగిక కోరిక తీర్చాలంటూ కోరాడు. ఇందుకు నిరాకరించిన రమేష్​పై సాయిలు రాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో రమేష్ ముఖం, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితున్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సాయిలుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండగా... పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

లైంగిక వాంఛ తీర్చనందుకు మిత్రునిపై దాడి...!

ఇవీచూడండి: రోడ్డు దాటుతుండగా... ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.