సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ పీర్ సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 8న ప్రారంభమైన జాతర వారం రోజులపాటు కొనసాగనుంది. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు దర్గాను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఆనవాయితీ ప్రకారం నిర్వహకులు ఎద్దుల జాతర నిర్వహిస్తున్నారు. పశువుల మధ్య పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. హల్లిదియోనితో పాటు వివిధ జాతులకు చెందిన ఎద్దుల జోడీలు కనువిందు చేస్తున్నాయి. మెదక్ ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటకకు చెందిన వ్యాపారులు జాతరలో దుకాణాలను ఏర్పాటు చేశారు. దుకాణాల్లో ఎడ్ల అలంకరణ సామగ్రి ఆకట్టుకుంటోంది. జాతరను తిలకించేందుకు ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన రైతులు భారీగా వస్తుంటారు.