సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని లీ ఫార్మా పరిశ్రమలో... పైప్‌లైన్ వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అక్కడ పని చేస్తూ... తీవ్ర గాయాలపాలైన విశాల్, చందన్ సింగ్, దొరబాబులను ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైటెక్ సిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇదే ప్రమాదంలో రామ్ విలాస్ పాశ్వాన్‌కు స్వల్ప గాయాలు కాగా... అతనికి ప్రథమ చికిత్స చేయించి ఇంటికి పంపించారు. అలాగే గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఎరిత్రో ఫార్మా పరిశ్రమలో స్క్రబ్బర్ నిలిచిపోవడంతో హెచ్‌సీఎల్ విషవాయువులు వెలువడ్డాయి. గడ్డపోతారం, చెట్ల పోతారం గ్రామాల్లో విషవాయువులు అలముకున్నాయి. ఈ విషవాయువుల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్య తీవ్రం కాకుండా పరిశ్రమ యాజమాన్యం చర్యలు చేపట్టింది.
ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!