ETV Bharat / state

Four Jobs in One Family in Sangareddy : ఒకే ఫ్యామిలీ.. ఒకేసారి.. నలుగురికి సర్కారీ కొలువులు.. ఆనందానికి లేవు అవధులు - ఒకే కుటుంబంలో నలుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు

Four Jobs in One Family in Sangareddy : కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఒకేసారి నలుగురికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఇటీవల ప్రకటించిన కానిస్టేబుల్​ ఫలితాల్లో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు సెలక్ట్​ కావడంతో వారితో పాటు ఆ గ్రామస్థులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Four Constable Jobs In Tribal Family in Sangareddy
Four Jobs in Sangareddy
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 4:57 PM IST

Four Jobs in One Family in Sangareddy : పని దొరికింది అంటే చాలు.. రాత్రి, పొద్దున అన్న తేడా లేదు. పిల్లల కడుపు నింపాలి. వారిని బాగా చదివించాలి.. అదే తపనతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆ తల్లిదండ్రులు. చెరకు సీజన్ వస్తే వలస వెళ్లాల్సిందే. నిజామాబాద్, మెట్​పల్లి జిల్లాలు తిరుగుతూ చెరకు నరికి ఎడ్లబండ్లలో కర్మాగారాలకు ఇచ్చేవారు. ఇలా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించారు. భూమి ఉన్నా.. అందులో రాళ్లూ-రప్పలే ఉండడం వల్ల అక్కడ ఎలాంటి పంట పండదు. వారికి ఉన్న ఒకే ఒక్క మార్గం కూలీ. అలా వచ్చిన ప్రతి కష్టాన్ని అనుభవించి వచ్చిన డబ్బులతో పిల్లల్ని బాగా చదివించారు.

Husband Celebrated Wife Promotion Video : ఎంత మంచి భర్తో..! ప్రమోషన్​తో ఇంటికొచ్చిన భార్యకు అద్దిరిపోయే వెల్​కమ్

తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన ఆ పిల్లలు.. రేయింబవళ్లు కష్టపడి చదివి సర్కారు కొలువు సాధించారు. తల్లిదండ్రులు పడిన కష్టానికి.. ఉద్యోగాలను బహుమతిగా ఇచ్చారు. అమ్మానాన్నలకు ఇక జీవిత కాలం వారిని సంతోషంగా చూసుకోవాలనుకున్న వారి కలను నిజం చేసుకున్నారు ఆ ముగ్గురు పిల్లలు. ఆ ఇంటికి పెద్ద కోడలిగా వచ్చిన తను కూడా కుటుంబ కష్టాలను చూసి వారికి చేదోడుగా నిలవాలి అనుకుంది. వారి సహకారం... కట్టుకున్న భర్త సహాయంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించించి ఆ యువతి. మొత్తానికి ఒకే ఇంట్లో నలుగురికి సర్కారు కొలువులు రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

Four Constable Jobs In One Family in Sangareddy : కూలీ కోసం వలస వెళ్లే ఆ కుటుంబంలో నలుగురికి పోలీసు ఉద్యోగాలు రావడంతో వారి ఆనందం అవధులు దాటింది. వారి విజయంతో ఆ తండా అంతా సంతోష వాతావరణం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పడిన సిర్గాపూర్ మండల్ పరిధిలో జముల తండాలో నెహ్రూ నాయక్​ మరోనీ బాయ్​కు ముగ్గురు సంతానం. కూలీ చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. కొద్ది రోజుల క్రితమే పెద్ద కుమారుడి వివాహం చేశారు.

తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తుంటే.. ఈ నలుగురు చిన్నపాటి పనులు చేసుకుంటూ ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. తల్లిదండ్రుల కష్టం వృథా కాకుండా.. ఎన్ని సమస్యలు ఎదురైనా... రేయింబవళ్లు చదివి కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. వాళ్ల తల్లిదండ్రులకు ఆ ఉద్యోగాలను బహుకరించారు. వాళ్ల తల్లిదండ్రుల సహకారంతోనే ఉన్నత చదువులు చదివి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించామని వారు అంటున్నారు. వాళ్లు చిన్నప్పటి నుంచి కష్టపడి వారిని చదివించారని చెప్పుకొచ్చారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెళ్లి విరిసింది. ఆ గ్రామ ప్రజలంతా వారందరికీ ఉద్యోగాలు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఒకటా రెండా మూడా.. ఒకే కుటుంబం.. 9 గిన్నిస్​ రికార్డులు

ఒడుదొడుకులను దాటి.. ఒలింపిక్స్​​కు అర్హత సాధించి..

తండ్రి పోస్టులోకి కూతురు.. కొత్త SIకి పోలీస్ స్టేషన్ బాధ్యతలు అప్పగించిన నాన్న

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.