సంగారెడ్డిలో వివిధ చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు మాస్కులు, శానిటైజర్లను మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ పంపిణీ చేశారు. మందు లేని మహమ్మరిని తరిమి కొట్టడమే ధ్యేయంగా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆపద సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఎలాంటి ఇబ్బందులు కల్గించొద్దని కోరారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ రక్షణ కోసమే పోలీసులు నిర్విరామంగా శ్రమిస్తున్నారని కొనియాడారు.
పోలీసులకు మాస్కులు పంపిణీ చేసిన బాబుమోహన్ - పోలీసులకు మాస్కులు పంపిణీ చేసిన బాబుమోహన్
సంగారెడ్డి జిల్లాలోని పలు హైవేలపై పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే, నటుడు బాబు మోహన్. మన ప్రాణాలు దక్కించుకోవడానికి స్వీయ నియంత్రణ కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. లాక్ డౌన్ విపత్కర పరిస్థితిల్లో మన ఇళ్లల్లో మనం ఎందుకు ఉండలేమంటూ ప్రశ్నించారు.
పోలీస్ విధులకు ఆటంకాలు కలిగించకూడదు : బాబు మోహన్