లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు పలువురు తమ ఆపన్నహస్తం అందిస్తున్నారు. తోచిన విధంగా సాయమందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నేతలు... పట్టణంలోని బాబుమోహన్ కాలనీలో గల పేదలకు ఆహార పొట్లాలు పంచి పెట్టారు. ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని పలువురికి ఆహార ప్యాకెట్లు అందజేశారు. ఉపాధి లేక ఇళ్లకే పరిమితమైన పేదలకు అన్నం పొట్లాలు పంపిణీ చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. కార్మిక నాయకులను అభినందించారు.
ఇదీ చూడండి: 'రేషన్ కార్డ్ లేనివారికీ 10 కిలోల ఆహార ధాన్యాలు...'