ETV Bharat / state

ఇంజిన్​లో మంటలు..నడిరోడ్డుపై కారు దగ్ధం.. - సత్వార్​లో కారులో చెలరేగిన మంటలు వార్తలు

కారు ఇంజన్​లో మంటలు చెలరేగి, కారు దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లా సత్వార్ సమీపంలోని 65వ నెంబరు జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Fires in the engine Car wreck on the roadside
ఇంజిన్​లో మంటలు..నడిరోడ్డుపై కారు దగ్ధం..
author img

By

Published : Dec 16, 2019, 11:51 AM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండలం సత్వార్​ సమీపంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి ఓ కారు ఇంజన్​లో మంటలు చెలరేగి, పూర్తిగా దగ్ధమయ్యింది. డ్రైవర్​ అప్రమత్తతతో కారులోని నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేశారు.

మహారాష్ట్ర​కు చెందిన ప్రయాణికులు హైదరాబాద్ నుంచి షోలాపూర్ వెళ్తుండగా సత్వార్ సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్​ కారును నిలిపివేశాడు. ఇంజన్​ను పరిశీలిస్తుండగా... ఒక్కసారిగా మంటలు వ్యాపించి నిమిషాల్లోనే కారు దగ్ధమైపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న చిరాగ్​పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంజిన్​లో మంటలు..నడిరోడ్డుపై కారు దగ్ధం..

ఇదీ చూడండి : హైదరాబాద్​ విశ్వవిద్యాలయాలల్లో "పౌర" సెగలు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.