ETV Bharat / state

సంగారెడ్డి ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం.. మేనేజర్ మృతి! - సంగారెడ్డి జిల్లా వార్తలు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని పిలెట్స్​ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న మేనేజర్ రామకృష్ణ మంటల్లో ఆహుతయ్యాడు.​ పరిశ్రమలోని డ్రయ్యర్​ పేలడం వల్ల అగ్నిప్రమాదం సంభవించింనట్టు పరిశ్రమ సిబ్బంది తెలిపారు.

Fire Accident in Pharma Industry in Sangareddy Manager die
సంగారెడ్డి ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం.. మేనేజర్ మృతి!
author img

By

Published : Sep 11, 2020, 10:26 AM IST

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని పిలెట్స్​ ఫార్మా పరిశ్రమలో డ్రయ్యర్​ పేలడం వల్ల భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో పరిశ్రమ మేనేజర్​ రామకృష్ణ మంటలకు ఆహుతై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పరిశ్రమలోని డ్రయ్యర్​ పేలడం వల్లే అగ్నిప్రమాదం సంభవించింనట్టు సిబ్బంది చెప్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మేనేజర్ రామకృష్ణ​ అక్కడే ఉండడం వల్ల పూర్తిగా మంటల్లో కాలిపోయాడు. పరిశ్రమ పైఅంతస్తులో ఉన్న డ్రయ్యర్​ ఒక్కసారిగా పేలడం వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. భారీ పేలుడుకు చుట్టుపక్కల ఉన్న అద్దాలన్నీ పగిలిపోయాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే పనిచేస్తున్న మేనేజర్​ రామకృష్ణ కనిపించకపోగా.. అనుమానించిన కార్మికులు శిథిలాల కింద వెతికారు. పూర్తిగా కాలిపోయి మాంసపు ముద్దగా మిగిలిన రామకృష్ణ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రసాయనాల పొగలు పీల్చుకున్న శ్రీకాంత్​ అనే కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బీడీఎల్​ భానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. రోడ్డుకు మోక్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.