సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద గ్రామంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని మూసివేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మండలంలోని వివిధ గ్రామాల రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లను నిలిపివేశారు. కేంద్రం వద్దకు శనగలు తెచ్చిన రైతులు… కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల ఆందోళనకు దిగారు.
ఇక్కడి అధికారులు ఇంత కాలం దళారుల శనగలు మాత్రమే కొన్నారని రైతులకు రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తూ చివరకి నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి రైతులను చెదరగొట్టగా.. అన్నదాతలంతా కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఇవీ చూడండి:లాక్డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్