ETV Bharat / state

చెరుకు బిల్లు బకాయిలు చెల్లించాలంటూ రైతుల నిరాహార దీక్ష - jaheerabad mandal news

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ఎదుట రైతులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. చెరుకు బిల్లు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు ఇవ్వాలని కోరారు.

farmers hungry strike at sugar cane in kotturu factory

author img

By

Published : Oct 22, 2020, 10:48 PM IST

చెరుకు బిల్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ఎదుట రైతులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కర్మాగారం ప్రారంభమై ఏడాది కావొస్తున్నా... బిల్లు చెల్లింపుల్లో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హిందూ మజ్దూర్ సంఘ్ నాయకుడు నామ రవికిరణ్ ఆధ్వర్యంలో రైతులు నిరాహార దీక్ష ప్రారంభించారు.

చక్కెర కర్మాగార యాజమాన్యం రైతు బిల్లు బకాయిల చెల్లింపులతో పాటు కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి రైతుల బకాయిల చెల్లింపుతో పాటు కార్మికులకు వేతనాలు ఇవ్వాలని... లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని నాయకులు ప్రకటించారు. ఆమరణ దీక్షకు రైతు సంఘాల నాయకులు హాజరై మద్దతు ప్రకటించారు.

ఇదీ చూడండి: కరోనాతో భర్త మరణం... తట్టుకోలేక భార్య బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.