సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో రామయ్య (72) అనే రైతు గుండె పోటు తో మృతి చెందాడు. ఆయనకు ఉన్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక ఎకరం భూమి ఇటీవల అధికారులు రికార్డుల నుంచి తొలగించారు. తన భూమి తిరిగి రికార్డులో చేర్పించేందుకు కొన్నాళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
మంగళవారం సైతం తన భూమి విషయం తెలుసుకునేందుకు తహసీల్ కార్యాలయానికి రామయ్య వచ్చాడు. అధికారులతో మాట్లాడి కొంత సేపు అక్కడే కూర్చున్న ఆయన కూర్చున్న చోటే వాలి పోయాడు. అక్కడున్న వారు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రైతు రామయ్య చనిపోయాడని వైద్యులు చెప్పారు.
ఇవీ చూడండి: తక్కువ ధరకే మాస్కులు... నకిలీ పత్రాలతో పక్కా ప్లాన్