ETV Bharat / state

నారాయణఖేడ్​లో నకిలీ పోలీసు అరెస్టు - నకిలీ పోలీసు అరెస్టు తాజావార్తలు

పోలీసునంటూ బెదిరించి వాహనాదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని నారాయణఖేడ్​ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.5800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సందీప్​ వెల్లడించారు.

Fake police Arrested by Narayanapeta polices
నారాయణఖేడ్​లో నకిలీ పోలీసు అరెస్టు
author img

By

Published : Jul 11, 2020, 10:46 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో పోలీసునంటూ చెలామణి అవుతున్న మంగలి సుభాశ్​ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డుపై వాహనాలను నిలిపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కిషన్​ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు అతనిని వలపన్ని పట్టుకున్నట్లు ఎస్సై సందీప్​ వెల్లడించారు.

నిందితుడు కామారెడ్డి జిల్లా తడ్కోల్​కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పట్టణ శివారులో వృద్ధులను టార్గెట్​ చేసి వారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుని నుంచి రూ.5800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి రిమాండ్​కు​ తరలించినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.