'కేసులు పెరిగినా... ప్రమాదాలు మాత్రం తగ్గాయి' - పటాన్చెరు ట్రాఫిక్ సీఐతో ముఖాముఖి
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు పరిధిలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయని ట్రాఫిక్ సీఐ వేణుకుమార్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా 65వ నంబరు జాతీయ రహదారిపై ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. 2019 జనవరి నుంచి ఇప్పటివరకు 730 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. తరచూ తనిఖీలుచేయడం వల్ల కేసులు పెరిగినా... ప్రమాదాలు మాత్రం తగ్గాయంటున్న ట్రాఫిక్ సీఐ వేణుకుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి....
Body:ఈ ఏడాది సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ట్రాఫిక్ తన పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువ నమోదయ్యాయని ట్రాఫిక్ సీఐ వేణు కుమార్ ఈటీవీ భారత్ కి ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో డిసెంబర్ 31 సందర్భంగా 65వ నంబరు జాతీయ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు 2019 జనవరి నుంచి ఇప్పటివరకు 730 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పట్టుకోడం జరిగిందని అందులో నాలుగు వందల అరవై తొమ్మిది మందికి మిగతా వారికి కోర్టు ద్వారా జరిమానా విధించడం జరిగింది ఆయన తెలిపారు ప్రమాదాలను నివారించడానికి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అని తెలిపారు గత ఏడాది కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించడం జరిగిందని చెప్పారు కేవలం వాహనచోదకులు మద్యం సేవించ కుండా వాహనాలు నడిపి ఇంటికి సురక్షితంగా చేరుకోవాలనే విశ్వాస పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇక వీటితోపాటు జాతీయ రహదారిపై ప్రమాదాల తగ్గించేందుకు కొన్ని మార్పులు తీసుకొచ్చామని అందువల్ల తగ్గుముఖం పట్టాయి అని తెలిపారు అలాగే ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు పెద్ద వాహనాల డ్రైవర్లకు పాఠశాలల్లో బహిరంగ ప్రదేశాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని సిఐ నరేష్ చెప్పారు ఇటు సైబరాబాదు మరోపక్క రహదారి ఇంకో పక్క జాతీయ రహదారి ఉండడం వల్లే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయని చెప్పారు
Conclusion:బైట్ వేణు కుమార్ ట్రాఫిక్ సీఐ పటాన్చెరు బైట్ నరేష్ సీఐ పటాన్చెరువు