RV engineering industry accident theree members injured : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న పారిశ్రామిక వాడలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్వీ ఇంజనీరింగ్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పటాన్ చెరులో ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బాధితుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామివాడలో ఆర్వీ ఇంజనీరింగ్ పరిశ్రమలో ఆవరణలోనే రెండు యూనిట్లు నడుపుతున్నారు.
ఒకదానిలో ఆర్వీ ఇంజనీరింగ్ పరిశ్రమ నడుపుతుండగా.. అదే ఆవరణలో ఆర్వీ పాలిమర్స్ పరిశ్రమ నడుపుతున్నారు. ఆర్వీ పాలిమర్స్‌కు చెందిన రియాక్టర్ ఇంజినీరింగ్ విభాగంలో ఉంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అకస్మాత్తుగా పేలింది. దీంతో ప్లాంట్ ఇంచార్జీగా ఉన్న రమాణారెడ్డి, అక్కడ పనిచేస్తున్న కార్మికుడు సతీష్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరితో పాటు రమాణారెడ్డిని కలిసేందుకువ వచ్చిన వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటినా పటాన్‌చెరులోని ఓ ఆసుపత్రికి తరలించారు.
- Fire Accidents In Telangana : రాష్ట్రవ్యాప్తంగా మూడు అగ్ని ప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం
- గడ్డపోతారం మైలాన్ పరిశ్రమలో పేలుడు.. ఐదుగురికి గాయాలు
Explosion in Pashamailaram industrial estate : ముగ్గురికి శరీరంతా గాయాలవ్వడంతో వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో విజయ్‌సింగ్ అనే కార్మికునికి కూడా స్వల్ప గాయాలు కాగా ఆయన ఇస్నాపూర్‌లో ఉన్న ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వెళ్లిపోయాడు. ప్రమాద సమయంలో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో పరిశ్రమలో పని చేస్తున్న మిగతా కార్మికలు భయందోళనకు లోనైయ్యారు.
"ఇవాళ సాయంత్రం నాలుగు ఆ ప్రాంతంలో పాశమైలారంలో ఉన్న పారిశ్రామిక వాడలో ఆర్వీ ఇంజినీరింగ్ కంపెనీలో పేలుడు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. దీనిపై కేసు నమోదు చేశాం. బాధితుల నుంచి పూర్తి సమాచారం తెలుసుకొని దర్యాప్తు ప్రారంభిస్తాం".- వినాయక్‌రెడ్డి, సీఐ బీడీఎల్ భానూరు
పేలుడు దాటికి పరిశ్రమ పై రేకులతో సహా ధ్వంసమైంది. పరిశ్రమలో మంటలు వ్యాపించడంతో మూడు అగ్నిమాపక వాహనాలుతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 12మంది పని చేస్తున్నట్లు తోటి కార్మికులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న బీడీఎల్ భానూరు పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Fires accidents in Telangana : మరోవైపు రాష్ట్రంలో ఇవాళ మూడు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఓ కంపెనీలో విద్యుత్ షార్ట్ సర్కుట్తో ప్రమాదం జరగగా.. సుమారు రూ.3 కోట్లు నష్టం వాటినట్లు కంపెనీ యాజమాన్యం చెబుతోంది. ఖమ్మం పత్తి మార్కెట్ యార్డ్‌లో ప్రమాదం అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో రూ.1.25కోట్ల విలువ చేసే పత్తి మంటల్లో కాలిపోయింది. పెద్దపల్లిలో ఓ సోలార్ ప్లాంట్‌లో సైతం ఇవాళ ప్రమాదం చోటుచోసుకుంది.
ఇవీ చదవండి: