సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కరోనా నిబంధనలు బేఖాతరు చేసి ఫీజుల కోసం పరీక్షలు నిర్వహించిన సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల యాజమాన్యానికి జిల్లా విద్యాధికారి నోటీసులు ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా పేపర్ పంపి ఇంటివద్దే పరీక్షలు నిర్వహించి పేపర్ పాఠశాలకు తీసుకురావాలని స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు తెలియజేసింది.
రెండు రోజులుగా విద్యార్థులు ఇంటి వద్ద రాసి పేపర్లు తీసుకొని పాఠశాలకు గుంపులుగుంపులుగా వెళ్లారు. కరోనా నిబంధనలు గాలికొదిలేసిన యాజమాన్యం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరీక్షల పేరుతో ఫీజులు వసూలు చేస్తూ కొవిడ్ నిబంధనలు పాటించకుండా పిల్లల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాధికారి రాజేశ్‌కు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందగా మండల విద్యాధికారిని పాఠశాలకు పంపి పరిశీలించారు. డీఈఓ ఆదేశాల మేరకు పాఠశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.
ఇదీ చదవండి: 'పబ్‌లు, మద్యం దుకాణాలే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు కాదా'