తనపై తప్పుడు మాటలు మానుకోవాలని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ మండిపడ్డారు. తాను తయారుచేసిన ఓటు బ్యాంకుతోనే ఇక్కడ తెరాస పుట్టి పెరిగిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలోని ప్రధాన దుకాణాల్లో భాజపా కార్యకర్తలతో కలిసి ఆయన రామ మందిర నిర్మాణం కోసం నిధులు సేకరించారు.
"హలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ఏదో సభలో నీవు వస్తావా.. నీ కుమారుడు వస్తాడా.. తేల్చుకుందామని అన్నావుగా. ఏమి తేల్చుకుందాం. నీ కబ్జాల విషయమా? కాంట్రాక్టుల విషయమా? మీ తమ్ముళ్ల బెదిరింపుల గురించా? దేని గురించి తేల్చుకుందాం చెప్పు. ఇప్పటికి 50సార్లు నన్ను జోకర్ అన్నావ్. నేను సినిమాలో మాత్రమే జోకర్ని.. అందుకే నాకు నంది అవార్డు వచ్చింది. నిజ జీవితంలో హీరో."
-బాబు మోహన్, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే
ఇదీ చూడండి: లైవ్ వీడియో: మేడ్చల్‌లో ప్రభుత్వ భూమి కబ్జా!