రాష్ట్రంలోని ప్రజల మనోభావాలను గౌరవిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీఎం అన్ని మతాల ప్రార్థనా మందిరాలు అభివృద్ధి చేస్తున్నారని... దీనిలో భాగంగానే యాదాద్రిలో పెద్దఎత్తున అభివృద్ధి చేపట్టారన్నారు.
ఓ పక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. దేవాలయం భూముల్లో అక్రమాలు చోటు చేసుకుండా చర్యలు తీసుకుంటామని ఆలయ ధర్మకర్తల మండలి నూతన అధ్యక్షులు తులసి రెడ్డి తెలిపారు. ఆలయానికి మున్సిపల్ వైస్‌ఛైర్మన్ నరసింహ గౌడ్ 5 తులాల బంగారు గొలుసు బహుకరించారు.
ఇదీ చూడండి : 20 వరకు బడ్జెట్ సమావేశాలు.. 8న పద్దు