ETV Bharat / state

బస్తీమే సవాల్​: ఎన్నికల వేళ... ఆడుకుందాం రండి వైకుంఠపాళీ ఆట...!

నిచ్చెనెక్కటం, పాము మింగితే కిందికి రావటం... చిన్నప్పుడు ఆడుకునే వైకుంఠపాళీ ఆట ఇది. ఇప్పుడు ఈ ఆటను ఓటర్లతో ఆడిస్తున్నారు సంగారెడ్డి పురపాలిక అధికారులు. ఎన్నికల వేళ ఈ ఆటల గోలేంటీ అనుకుంటున్నారా...? ఎన్నో సందేశాల మిళితమైన ఈ ఆట ద్వారానే... ఓటర్లను ఆకర్షిస్తూ ఓటు హక్కుపై చైతన్యం తెస్తున్నారు అధికారులు. ఎన్నికల నిబంధనలపై ప్రజలకు సవివరంగా అవగాహన కల్పిస్తున్నారు.

ELECTION OFFICERS CONDUCTING GAMES FOR AWARENESS ON VOTING

author img

By

Published : Jan 21, 2020, 2:08 PM IST

బస్తీమే సవాల్​: ఎన్నికల వేళ... ఆడుకుందాం రండి వైకుంఠపాళీ ఆట...!

నిచ్చెనలు, పాములతో ఎంతో ఆసక్తికరంగా సాగే వైకుంఠపాళీ ఆటలో ఎంతో పరమార్థం దాగి ఉంటుంది. ఈ సందేశాత్మకమైన ఆటను ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వినియోగించుకుంటున్నారు ఎన్నికల అధికారులు. నిచ్చెనలు వచ్చినప్పుడు పైకి ఎక్కుతూ... పాములు వచ్చినప్పుడు కిందికి జారుతూ... ప్రతి అడుగులో ఓ సందేశాన్నిచ్చే ఈ ఆట ఆధారంగా... సంగారెడ్డి పురపాలక సంఘం అధికారులు సరికొత్త వైకుంఠపాళీని రూపొందించారు. నిచ్చెనలొచ్చినప్పుడు... పోలింగ్ కేంద్రంలో చేయాల్సిన అంశాలు, పాములు వచ్చినప్పుడు చేయకూడని పనులు వివరిస్తూ... ఎన్నికల వేళ ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తున్నారు.

ఆసక్తి పెంచుతున్న ఆట...

కళాశాలలు, జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వైకుంఠపాళీని ప్రదర్శించి... ఆడిస్తున్నారు. ప్రస్తుతం అంతగా అందుబాటులోలేని ఈ ఆట ఆడటానికి ఓటర్లు ఆసక్తిగా ముందుకు వస్తున్నారు. తమకు పడిన నెంబర్ ఆధారంగా గళ్లు మారుతూ... అక్కడ ఉన్న అంశాన్ని గ్రహిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో చేయకూడని అంశం ఉన్న గడిలోకి వస్తే... పాము మింగి కిందికి దిగిపోతున్నారు. చేయాల్సిన అంశం ఉన్న గడి వస్తే... అందులోని నిచ్చెన ఆధారంగా పైకి వెళ్తున్నారు. ఆడుతున్న వ్యక్తి ఎందుకు కిందకు వెళ్తున్నాడు... పైకి వెళ్తున్నాడు అన్న అంశాలను అధికారులు సవివరంగా వివరిస్తున్నారు.

ఇటువంటి విన్నూత్న ఆలోచనల వల్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించటమే కాకుండా... ఓటు హక్కు ప్రాధన్యతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అధికారులు. చేయకూడని, చేయదగిన అంశాలపై సులుభంగా అవగాహన కల్పిస్తూ... చైతన్యవంతుల్ని చేస్తున్నారు.

ఇంతకీ ఈ.. వైకుంఠపాళీ ఓటర్లకు అర్థమైందా? అధికారుల ఆలోచన సఫలీకృతమైందా!? తెలియాలంటే.. 'పుర' ఫలితాలు రావాల్సిందే...

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఓటర్లను మత్తులో ముంచుతున్న అభ్యర్థులు

Intro:Body:

pralobhalu

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.