విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను సన్మానించడం పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1971-72 పదోతరగతి బృందం... పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నాగిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తమకు విద్యబోధించిన గురువులను సన్మానించారు. విద్య బోధించిన ఉపాధ్యాయులను సన్మానించడమంటే సాక్షాత్తు దేవతలను పూజించినట్లేనని నాగిరెడ్డి అన్నారు. 47 ఏళ్ల తర్వాత తన తోటి మిత్రులు కలుసుకోవటం ఆనందంగా ఉందన్నారు. పాఠశాలతో తన అనుబంధం, చిన్ననాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ బాల్రెడ్డి, సీఐ తిరుపతి రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాజకీయ అరంగేట్రంపై కంగనా ఆసక్తికర సమాధానం