నారాయణఖేడ్‌లో ముందస్తు అరెస్టులు హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై నిర్వహిస్తున్న మిలియన్ మార్చ్‌కు వెళ్లకుండా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో భాజపా, కాంగ్రెస్, సీపీఎం, ఆర్టీసీ కార్మికులను 20 మందిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిస్కారం కోసం మిలియన్ మార్చ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్ట్‌లు ఏంటని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తుందని ఆరోపించారు.
ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లాన్నొదిలేశాడు'